71వ జాతీయ చలనచిత్ర అవార్డులను గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తమ చిత్రంగా బాలీవుడ్ చిత్రం ‘12th ఫెయిల్’ ఎంపిక కాగా, ‘ఉత్తమ నటుడు’ అవార్డును ‘జవాన్’ చిత్రం నుంచి షారుక్‌ఖాన్, ‘12th ఫెయిల్’ చిత్రం నుంచి విక్రాంత్ మస్సే పంచుకున్నారు. ఇక తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. అయితే ఈ సినిమాకు నేషనల్ అవార్డు ప్రకటించిన సందర్భంగా భగవంత్ కేసరి చిత్రయూనిట్ అంతా కలిసి నేడు బాలకృష్ణని కలిసింది. అనంతరం బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ సమవేశంలో బాలయ్యతో పాటు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, శ్రీలీల తదితరులు పాల్గోన్నారు.