Homeissese80 ఏళ్ల వృద్ధుడికి వలపు వల..8.7కోట్ల‌కి టోక‌రా

80 ఏళ్ల వృద్ధుడికి వలపు వల..8.7కోట్ల‌కి టోక‌రా

ఫేస్ బుక్ లో మొదట షార్వీ అనే పేరుతో పరిచయం ఏర్పరుచుకొని.. భర్త నుంచి విడిపోయి, పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని వృద్ధుడికి మాయమాటలు..వృద్ధుడితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ పలుమార్లు డబ్బులు కాజేసిన షార్వీ.. ఆ తర్వాత తన స్నేహితురాలిని అంటూ కవిత అనే పేరుతో మరో ట్రాప్..తర్వాత షార్వీ చనిపోయిందని, తాను ఆమె సోదరి దినాజ్‌ను అంటూ ఆసుపత్రిలో బిల్లులు కట్టాలంటూ తప్పుడు ఆధారాలు చూపించి మళ్ళీ డబ్బులు స్కాం..ఆ తర్వాత దినాజ్‌ స్నేహితురాలిని జాస్మిన్‌ను అంటూ ఇలా నలుగురు అమ్మాయిల పేరుతో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు..డబ్బులు అయిపోయిన వేరే వారితో అప్పు చేసి మరీ పంపిన వృద్ధుడు..కుటుంబసభ్యులు డబ్బుల విషయం గురించి పలుమార్లు ప్రశ్నించి, చెప్పడం లేదని ఆరా తీయగా తెలిసిన స్కాం..ఇదంతా సైబర్ మోసం అని తెలిసి ఆసుపత్రి పాలైన వృద్ధుడు.. ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు తెలిపిన డాక్టర్లు..సైబర్ మోసంపై ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read