సూపర్‌స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న SSMB29 ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు అందరూ ఎదురుచూసిన విషయం తెలిసిందే. అభిమానులు ఎదురుచూసినట్లే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా మూవీ లవర్స్‌ని, మహేశ్ బాబు అభిమానులను ఉద్దేశించి ఒక లెటర్‌ను విడుదల చేశాడు. సినీ ప్రియులకు, మహేష్ బాబు అభిమానులకు నమస్కారం. SSMB29 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయ్యింది. ఈ సినిమా గురించి తెలుసుకోవాలని మీరు చూపిస్తున్న ఆసక్తికి ధన్యవాదాలు. అయితే ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కబోతుంది కాబట్టి.. కేవలం కొన్ని ఫోటోలు లేదా ప్రెస్ మీట్లతో దీని గురించి పూర్తి వివరాలు చెప్పడం సాధ్యం కాదు. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం. నవంబర్ 2025లో మహేశ్ లుక్‌ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఈ చిత్రం ఉండబోతుంది. మీ సహనానికి ధన్యవాదాలు అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు.