గురువారం రాష్ట్ర సచివాలయంలో మడకశిర శాసనసభ్యులు ఎం.ఎస్.రాజు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా… శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి, మర్యాద పూర్వకంగా సన్మానించారు.