HomeEntertainmentకిష్కింద‌పురికి..సెన్సార్ కంప్లీట్

కిష్కింద‌పురికి..సెన్సార్ కంప్లీట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘కిష్కిందపురి’ . హార‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 12న విడుద‌ల కాబోతుండ‌గా.. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎటువంటి క‌ట్స్ లేకుండా ఏ() సర్టిఫికెట్‌ను జారీ చేసిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. అయితే ఈ సినిమాకు పిల్ల‌ల‌కు అనుమ‌తిలేద‌ని తెలిపిన చిత్ర‌బృందం.. గుండె ధైర్యం లేని వారు ఈ సినిమాకు రావోద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read