HomePoliticalStory : భ‌విష్య‌త్త్ త‌రాల‌కి చంద్రుడు..రాష్ట్రాభివృద్ధికి బాట‌లు వేసే నాయ‌కుడు

Story : భ‌విష్య‌త్త్ త‌రాల‌కి చంద్రుడు..రాష్ట్రాభివృద్ధికి బాట‌లు వేసే నాయ‌కుడు

చంద్ర‌బాబు ఈ పేరు చెప్ప‌గానే విజ‌న‌రీ లీడ‌ర్ గుర్తొస్తారు..ముందు చూపుతో భ‌విష్య‌త్ త‌రాల వారికి ఏం కావాలో ముందే డిజైన్ చేసి పెట్టే నేత‌గా పేరుగాంచారు చంద్ర‌బాబు నాయుడు. నాలుగ‌వ‌సారి సీఎంగా బాద్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న జీవితం ప‌రిచిన పూల‌బాట ఏం కాదు..ఆయ‌న న‌డిచే దారిలో కూడా ముళ్లు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మృత్యువు అంచుల‌వ‌ర‌కు వెళ్లి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారాయ‌న‌..ఎన్నో అదృశ్య శ‌క్తుల‌తో పోరాడారు..ఆఖ‌రికి జైలుకి వెళ్లి వ‌చ్చిన ప‌రిస్థితులు చూశారు.ఏది ఏమైనా చెక్కు చెద‌ర‌ని ధైర్యం ..ఆయ‌న‌ని వీడని ఆత్మ‌స్థైర్యం అవే ద‌టీజ్ చంద్ర‌బాబు అనిపించేలా చేశాయి..దేశ‌మే కాదు ప్ర‌పంచ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తిగా ఆయ‌న్ని కొనియాడుతుంటారు ప్ర‌పంచ‌నేత‌లు సైతం. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలోకి న‌డిపేందుకు ఆయ‌న శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తుంటారు ఈ 70ఏళ్ల న‌వ యువ‌కుడు.

యువ‌కులు సైతం ఆశ్చ‌ర్య‌పోయే ఎన‌ర్జీ ఈయ‌న సొంతం..ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు అప్ర‌మ‌త్త‌మ‌యి ఆదుకునేందుకు ముందుండే సీఎంగా ఎన‌లేని పేరుగాంచారు చంద్ర‌బాబు. హుదూదే కాదు , వ‌ర‌ద‌లు రాని భూకంపాలే రాని త‌న‌దైనశైలిలో ఆ విప‌త్తు నుండి ప్ర‌జ‌ల‌ని కాపాడే స‌త్తా ఈయ‌న సొంతం. అందుకే అతి శ‌క్తిమంతుడైన నాయ‌కుడ‌ని ఇండియాటుడే సైతం కొనియాడింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.

ఇక అత్యంత శ‌క్తిమంతులైన సీఎంల‌లో చంద్ర‌బాబు తర్వాత బీహార్‌, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రులు నితీశ్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఎంకే స్టాలిన్‌, మమతాబెనర్జీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు. జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్‌ పక్షిలా పునర్జన్మనెత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని ‘ఇండియా టుడే’ క‌థ‌నం అభివ‌ర్ణించింది. హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చారిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్ర‌శంసించింది. ప్ర‌స్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని పేర్కొంది. జనసేన, బీజేపీతో కూట‌మిగా ఏర్ప‌డి టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని త‌న‌ ప్రత్యేక కథనంలో చంద్ర‌బాబుకు ‘ఇండియా టుడే’ కితాబునిచ్చింది. చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది.

ప్ర‌స్తుతం కేంద్రంలో చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్నారు. లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సంక‌టం త‌ప్ప‌దు. అందుకే పాలక ఎన్‌డీఏలో ఆయ‌న కీల‌కం అయ్యారు. నాలుగోసారి సీఎం అయిన చంద్ర‌బాబు.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల విజన్‌-2047 డాక్యుమెంట్‌ ను చంద్రబాబు ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్‌ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు. కార్పొరేట్లతో స్నేహ‌భావంతో మెలిగే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజనెస్ (ఐఎస్‌బీ) ఏర్పాటుకు చొరవ చూపించారు” అని ‘ఇండియా టుడే’ త‌న కథనంలో రాసుకొచ్చింది. ఒక ఇండియా టుడే అనే కాదు ఏపీకి ఆయ‌న సీఎం అయిన నాటి నుండే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌పంచ‌కుబేరులు సిద్ధ‌మ‌వుతున్నారంటే ఆ ఘ‌న‌త కేవలం చంద్ర‌బాబుదే అని ఎవ‌రిని అడిగినా చెబుతార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img