హైదరాబాద్:డిసెంబర్ 11..సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ముత్యాల మ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటన అక్టోబర్ 13 ఆదివారం రోజు రాత్రి సమయంలోజరిగింది.ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కుమ్మరి గూడలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దేవత విగ్రహాన్ని పునర్ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మ వారి విగ్రహాన్ని వేద పండితుల సమక్షంలో ప్రతిష్టించారు.అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.ప్రజల విశ్వాసం కాపాడేలా మా ప్రభుత్వం ముందుకు వెళుతుందని,అన్నారు. దేవాలయాలను కాపాడు కోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు దేవాలయాలకు విద్రోహం జరిగినప్పుడు అందరం కలిసి ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు..