HomeEntertainmentర‌జ‌నీకాంత్..అమీర్ ఖాన్ ల‌పై షూట్

ర‌జ‌నీకాంత్..అమీర్ ఖాన్ ల‌పై షూట్

కూలీ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. కూలీ Coolie షూటింగ్‌ దశలో ఉంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో కొత్త షెడ్యూల్‌ షురూ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు అమీర్‌ ఖాన్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడని తెలిసిందే. అమీర్‌ ఖాన్‌తోపాటు త‌మిళ సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌పై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. అమీర్‌ఖాన్‌ త్వరలోనే చిత్రీకరణలో జాయిన్ కానున్నాడు. రానున్న 10 రోజులపాటు అమీర్‌ ఖాన్‌, తలైవా వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ నెలాఖరు కల్లా కూలీ షూటింగ్ పూర్తి కానున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. టైటిల్‌ టీజర్‌లో బంగారంతో డిజైన్‌ చేసిన ఆయుధాలు, వాచ్‌ ఛైన్లతో సూపర్ స్టార్‌ చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ పార్ట్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. గోల్డ్‌ అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్‌ బాయ్స్ ఫేం సౌబిన్‌ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కూలీలో తలైవా స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img