నటుడు జగపతి బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘ నేను షూటింగ్ నుంచి రాగానే ఆస్పత్రికి వెళ్ళాను. ఈ ఘటనలో బాధితులైన రేవతి కుటుంబాన్ని, శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించాను. మానవత్వంతో అక్కడికి వెళ్లాను. ఆ బాబు ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పాను. అయితే నేను శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లినట్టు పబ్లిసిటీ చేసుకోలేదు. కాబట్టి ఎవరికి తెలియదు. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అంటున్నారు. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్. జగపతిబాబు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.