HomeEntertainmentసీఎం భూపేంద్ర ప‌టేల్ ని క‌లిసిన‌..మోహ‌న్ బాబు..విష్ణు

సీఎం భూపేంద్ర ప‌టేల్ ని క‌లిసిన‌..మోహ‌న్ బాబు..విష్ణు

న‌టుడు మోహ‌న్ బాబు, త‌న కుమారుడు మంచు విష్ణుతో క‌లిసి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్‌ను క‌లిశారు. ఈ విష‌యాన్ని మోహ‌న్ బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. సీఎంతో క‌లిసి దిగిన ఫొటోల‌ను కూడా ఆయ‌న పంచుకున్నారు. మంచు విష్ణు, శ‌ర‌త్ కుమార్, న‌టుడు ముఖేశ్ రిషిల‌తో క‌లిసి ఆయ‌న గుజ‌రాత్ సీఎంను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు తెలంగాణ క‌ళాకారుడు ర‌మేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను బ‌హుమ‌తిగా అంద‌జేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మోహ‌న్ బాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు.

ఫొటోల‌ను పంచుకున్న ఆయ‌న ఎంతో ఆనందంగా ఉంద‌ని ట్వీట్ చేశారు. మంచు విష్ణు, శరత్ కుమార్, ముఖేశ్‌ రిషి, వినయ్ మహేశ్వరితో పాటు గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఆయ‌న‌ను క‌లిసే అవ‌కాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయ‌న ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నా. ఈ సంద‌ర్భంగా విష్ణు ఆయ‌న‌కి ప్రఖ్యాత తెలుగు కళాకారుడు రమేశ్‌ గొరిజాల పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రాన్ని మ‌రింత‌ పురోగతివైపు నడిపిస్తున్న‌ డైనమిక్ లీడర్‌గా ఆయన ఈ విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా అని మోహ‌న్ బాబు ట్వీట్‌లో రాసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img