HomeEntertainmentఅల్లు అర్జున్ కేసు..మాకు ఉప‌యోగ‌ప‌డింద‌న్న న‌టుడు

అల్లు అర్జున్ కేసు..మాకు ఉప‌యోగ‌ప‌డింద‌న్న న‌టుడు

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌ల‌టా జ‌రిగిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్‌పై కేసు న‌మోదు అవ్వ‌గా.. హైకోర్టు అత‌డికి బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదిలావుంటే ఈ సినిమాలో జ‌రిగిన తొక్కిస‌లాట కేసు మా సినిమాకు బాగా ఉపయోగపడిందని తెలిపాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్‌-స్టేట్‌ వర్సెస్‌ ఏ నో బడీ . రామ్‌జగదీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హీరో నాని సమర్పకుడు వ్య‌వ‌హారిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటున్నాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి.ఇంట‌ర్వ్యులో ఆయ‌న మాట్లాడుతూ.. పుష్ప 2 ది రూల్ ఘ‌ట‌న‌లో అల్లు అరెస్ట్ అవ్వ‌గా.. ఈ కేసు మాకు బాగా ఉపయోగపడిందని తెలిపాడు ప్రియ‌ద‌ర్శి. అల్లు అర్జున్ బెయిల్‌కి సంబంధించి ఈ కేసు విచారణలో న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉపయోగించిన భాషను గమనించిన ‘కోర్ట్’ చిత్ర బృందం, కోర్ట్ సినిమాలోని డబ్బింగ్‌ను మ‌రింత స‌హ‌జంగా తీర్చిదిద్దిన‌ట్లు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read