ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కాషాయ వస్త్ర ధారణలో కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ ‘VD 12’ కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏడాది నుంచి ఎవరికీ కనిపించకుండా తన హెయిర్‌ని క్యాప్‌తో కవర్ చేస్తూ వస్తున్నాడు. ఎంత పెద్ద ఈవెంట్‌కు వెళ్లినా తలపై క్యాప్ మాత్రం విజయ్ తీయలేదు. తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటి సారి క్యాప్ లేకుండా దర్శనమిచ్చాడు. విజయ్ బోల్డ్ లుక్‌తో బయటి ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.