HomePoliticalStory : భార‌త్ కి..రూ.180కోట్లు.. ఎవరీ వీణారెడ్డి ?

Story : భార‌త్ కి..రూ.180కోట్లు.. ఎవరీ వీణారెడ్డి ?

భారత్‌లో ఎన్నికల ఓటింగ్ పెంచేందుకు అంటూ బైడెన్ ప్రభుత్వం 21 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.180 కోట్లు కేటాయించింది. యూఎస్ ఎయిడ్ కింద ప్రతీ సారి ఇస్తూ ఉంటారు. ఈ సాయాన్ని మేము ఎందుకు ఇవ్వాలని…భారత్ వద్ద బోలెడు డబ్బు ఉందని చెప్పి ట్రంప్ ఇప్పుడు ఆపేశారు. అయితే అసలు ఈ డబ్బుతో ఇండియాలో ఏం చేశారన్నది రకరకాల చర్చలకు కారణం అవుతోంది. ఇప్పుడు అది మోదీని ఓడించడానికి బైడెన్ ప్రభుత్వం చేసిన పనిగా గుర్తించారు. భారత్ లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం చేశారని ఆయన అంటున్నారు.

డబ్బులు కేటాయించడంతో పాటు.. యూఎస్ఎయిడ్ తరపున ఎన్నికల్లో పని చేసేందుకు వీణా రెడ్డి అనే మహిళను బైడెన్ ప్రభుత్వం ఇండియాకు పంపింది. ఇక్కడ ఆమె ఎన్నికల సమయంలో చురుకుగా వ్యవహరించారు. 2021లో భారత్‌కు వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారని బీజేపీ ఎంపీ మహేశ్ జఠ్మలానీ ఆరోపించారు. ఈ విషయంలో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ ‌లో పోస్ట్ పెట్టారు. దీంతో వీణారెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ అసద్ విషయం ఏమిటంటే 2012లో ఎన్నికల కమిషన్, యూఎస్ఏఐడీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది ఓటింగ్ పెంచడానికి అని చెబుతున్నా.. బీజేపీ మాత్రం ఏదో కుట్ర ఉందని అనుమానిస్తోంది. ఇప్పుడు వీణారెడ్డి దేశంలో ఉన్న కాలంలో ఏం చేసిందో దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఈ కారణంగానే చేస్తోంది. వీణారెడ్డి ని యూఎస్ ఎయిడ్ కోసం నియమించినప్పుడు జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అభినందించిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img