HomePoliticalతాడిప‌త్రి అభివృద్ధే నాధ్యేయం

తాడిప‌త్రి అభివృద్ధే నాధ్యేయం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు..తాడిపత్రిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ.. ఇకపై చెత్త వేస్తే తిరిగి వారి నివాసంలో వేస్తామని తనదైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చారు.. తాడిపత్రి అభివృద్ధి కోసం నేను పాటుపడుతూ ఉంటే ప్రజలు సహకరించకపోతే ఎలా అని ప్రశ్నించారు. మీరు మారండి , మారకపోతే నన్ను ఊరు విడిపించండని ప్రజలను కోరారు. మీ పిల్లలకు మంచి చదువులు చెప్పించడం కాదు, క్రమశిక్షణ నేర్పించండి ప్రజలకు సూచించారు. ప్రపంచంలోనే కుబేరులంతా పెద్దగా చదువు రానివారేనని ఆలోచనలు సక్రమంగా పనిచేస్తే ప్రయోజకులవుతారన్నారు.

తాడిపత్రిలో నల్లబండల పరిశ్రమలు స్థాపించిన వారంతా చదువురాని వారేనని వారు మంచి స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. ఆలయాలలో శివమాల అయ్యప్ప స్వామి మాల చేసిన వారు సేవ చేస్తే బాగుంటుందని హితవు పలికారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని గతంలోనే స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నందలపాడు, సజ్జలదిన్నె పారిశ్రామిక వాడల్లో ఉన్న నల్ల బండలలో పాలిష్ వృథా రాళ్లు రోడ్ల పక్కన వేస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు. తాడిపత్రి అభివృద్ధి చెందిందంటే పరిశ్రమల వల్లే సాధ్యమైందన్నారు జేసీ… పరిశ్రమలు స్థాపించిన యజమానులు అందరూ బాగా చదువుకున్న వారేనని.. పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంటు బంద్ చేయిస్తామని స్పష్టం గతంలోనే జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img