HomeEntertainmentగాయ‌కుడికి..'భావోద్వేగ' గాయం

గాయ‌కుడికి..’భావోద్వేగ’ గాయం

మ‌రో సీనియ‌ర్ జంట విడిపోనున్నారు..ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకోబోతున్నారు..దీనికి సంబంధించి లాయర్ వందనా షా విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక విషయాలు ఉన్నాయి. పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి వైవాహిక బంధానికి తగిలిన ‘భావోద్వేగ గాయం’ ఈ నిర్ణయానికి కారణంగా ఉంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. దంపతుల మధ్య తలెత్తిన ఉద్రిక్తపూర్వక, ఇబ్బందికర పరిస్థితులు అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని ఇరువురూ గుర్తించారు. ఈ పరిస్థితిలో కలిసి ఉండలేమని ఇరువురూ భావించారు. బాధ, ఆవేదనతో సైరా బాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

వ్యక్తిగత జీవితంలో అత్యంత సంక్లిష్టమైన దశలో ఉన్నందున జనాలు అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతకు విలువనివ్వాలని ఆమె అభ్యర్థించారు’’ అని లాయర్ వందనా షా వివరించారు.ఏఆర్‌ రెహమాన్‌ కూడా విడాకులపై స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని అన్నారు. పగిలిన హృదయాలు దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, తిరిగి యథాతథంగా అతుక్కోలేవని రెహమాన్ వ్యాఖ్యానించారు. కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు.కాగా రెహమాన్‌ దంపతులు 1995లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 29 ఏళ్లు కలిసి జీవించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఖతీజా, రహీమా, అమీన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img