ఇండియా ‘హెచ్ 125‘ హెలికాప్టర్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన ఎయిర్‌బస్ సంస్థ కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిశీలన చేశారు. అనంతపురాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం భూ కేటాయంపుల కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ తరలివస్తోంది! రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ‘ఎయిర్‌బస్’ నిర్ణయించినట్టు తెలిసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో హెలికాప్టర్ల తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను తమకు అనువైన రాష్ట్రంగా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇందుకు అనువైనదిగా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిందని తెలుస్తుంది.