HomeEntertainmentఅక్కినేని అవార్డు..కొత్త కోడ‌లు మెరుపులు

అక్కినేని అవార్డు..కొత్త కోడ‌లు మెరుపులు

నటసామ్రాట్‌ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024వ సంవత్సరానికి గాను అగ్ర నటుడు చిరంజీవికి ఇవ్వనున్నట్టు అక్కినేని కుటుంబం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు జ‌రిగే ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ రానున్నారు. అయితే ఈ వేడుక‌కు సంబంధించి ఇప్ప‌టికే అక్కినేని ఫ్యామిలీతో పాటు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు హాజ‌ర‌య్యారు. తాజాగా అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టే కాబోయే కొత్త‌ కోడ‌లు శోభితా ధూళిపాళ కూడా ఈ వేడుక‌కు వ‌చ్చింది. లైట్ గ్రీన్ క‌ల‌ర్ సారీలో వ‌చ్చిన శోభితా ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read