దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇప్పటికే పలువురు యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి కొత్త నటుడిని అందరికీ పరిచయం చేస్తున్నాడు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్ కుమారుడు) నందమూరి తారకరామారావు ఫస్ట్ దర్శన్ వీడియోను షేర్ చేశాడు వైవీఎస్ చౌదరి. ప్రొడక్షన్ నంబర్ 1గా రాబోతున్న ఈ చిత్రాన్ని New Talent Roars బ్యానర్‌లో వైవీఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మిస్తుండటం విశేషం.నందమూరి తారకరామారావు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫస్ట్ దర్శన్ వీడియో చెప్పకనే చెబుతోంది. నటుడిగా అందరినీ ఇంప్రెస్ చేసేందుకు యాక్టింగ్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకోవడంతోపాటు మేకోవర్ కూడా మార్చుకున్నట్టు తాజా లుక్స్‌తో తెలిసిపోతుంది.
ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. చంద్రబోస్ పాటలు అందిస్తున్నాడు. ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రామ్ సినీ ప్రపంచంలోకి నీ మొదటి దశకు ఆల్ ది బెస్ట్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీవు చేసే ప్రతి ప్రాజెక్టు విజయం సాధించాలి. నీకు అన్నింటా విజయమే దక్కాలని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు కచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటావన్న నమ్మకం నాకుంది. నీ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి మై బాయ్ అని తారక్ ట్వీట్ చేశారు.