HomeEntertainment'అల్లు అర్జున్' ఇంటికి భ‌ద్ర‌త పెంపు

‘అల్లు అర్జున్’ ఇంటికి భ‌ద్ర‌త పెంపు

ఆదివారం ఓయూ జేఏసీ నాయకులు హీరో అల్లు అర్జున్ ఇంటి ముందు నిరసనకు దిగారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలతో అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. కాగా విద్యార్థి సంఘాల ఆందోళనలపై అల్లు అరవింద్ స్పందించారు.

మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు పెట్టారు. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్లను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేం కూడా సంయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కోరారు.అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలీస్ బలగాలు భారీగా మొహరిస్తున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కూడా భారీగా ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కు పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img