తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీతో హీరో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరి కాంబోలో హై యాక్షన్ సినిమా తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తున్నది. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు. ఇక అల్లు అర్జున్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.