HomePoliticalజోరుగా అమరావతి పనులు – ఫేక్ ప్రచారమూ అంతే !

జోరుగా అమరావతి పనులు – ఫేక్ ప్రచారమూ అంతే !

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏమిటో కానీ ఓ రాజధానిని అభివృద్ధి చేసుకుందామంటే.. ఏపీలోని కొంత మంది కుట్ర దారులే కాళ్లలో కట్టెలు అడ్డం పెట్టే పనులు చేస్తున్నారు. అమరావతి అభివృద్ధికి నిధులు రాకుండా.. లోన్లు రాకుండా.. పెట్టబడులు రాకుండా చేయడానికి తప్పుడు మెయిల్స్ పెట్టడమే కాదు .. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. రోజు రోజుకు ఈ ఫేక్ ప్రచారం శృతి మించిపోతోంది.అమరావతిలో పది వేల మందికిపైగా పని చేస్తున్నారు. అత్యధిక మ్యాన్ పవర్, అత్యాధునిక టెక్నాలజీ వాడి వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది. కాంట్రాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఎటు చూసినా పనులు జరుగుతూ కళకళలాడుతోంది. అయితే కొంత మంది .. అమరావతిపై ద్వేషంతో కళ్లు మూసుకుపోయినవారికి మాత్రం అక్కడ ఏ పనీ జరగడం లేదని అనిపిస్తోంది. ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. నిధుల మళ్లింపు అని.. కాంట్రాక్టర్లు కట్టలేకపోతున్నారని ఏదో ఒకటి చెప్పుకుంటూ పుకార్లు రేపేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

ఒకడు హై రైజ్ అపార్టుమెంట్లు అంటే యాభై అంతస్తులు కట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అంటాడు. ఇంకొకడు..వరదలు వచ్చేశాయని ప్రచారం చేస్తూంటాడు. వీళ్ల వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలో సీఆర్డీఏకు అర్థం కావడం లేదు. కేసులు పెట్టాలంటే… వారికి మరింత ప్రచారం కల్పించినట్లవుతుంది. అలాగని వారిని వదిలేయలేకపోతున్నారు. సొంత రాష్ట్ర రాజధానిపై ఇలా కుట్రలు చేయాల్సిన అవసరం ఏమిటో ఆ ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఆలోచిస్తే.. చాలా వరకూ సమస్య పరిష్కారం అవుతుంది.అమరావతి అభివృద్ధి చెందిదే ఏపీ బాగుపడుంది. ఏపీ బాగుపడటం అంటే అర్థం ఏమిటి.. ప్రజలందరూ బాగుపడటం. ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగితే లాభం ఎవరికి?. ఈ విషయం ఆలోచించుకుండా.. రాజకీయ కుట్రలు చేసే వారి కోసం.. సొంత కుంపటిలో నిప్పులు పోసుకుంటే ఏం వస్తుంది?. అమరావతిపై ఫేక్ ప్రచారం చేసే వాళ్లు తాము ఎవరి కుట్రలో భాగమవుతున్నామో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read