వచ్చే సంవత్సరం నుండి డివైజ్ ల వాడకంలో పరిమితిని విధించనున్నట్లు ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. ఇండియాలో ఉన్న టాప్ ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. నెట్‌ఫ్లిక్స్ తర్వాత ఆ రేంజ్‌లో హాలీవుడ్ కంటెంట్‌ను అందిస్తువస్తుంది. అయితే ప్రైమ్ యూజర్లకు ఓటీటీ బెనిఫిట్స్‌తో పాటు అమెజాన్ ఈ కామర్స్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్ అయిన వారికి ఒకరోజులోనే డెలివరీలను అందిస్తుంది. ఇదిలావుంటే ప్రైమ్ వీడియో తమ యూజర్లకు షాక్‌ను ఇస్తూ.. సంచలన ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రైమ్ వీడియోలో డివైజ్‌ల వాడకంపై పరిమితి విధించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఒక్క ప్రైమ్ అకౌంట్‌తో ఒకేసారి 5 డివైజ్‌లు వాడుకోవచ్చు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకువస్తున్న ప్లాన్ ప్రకారం.. 5 డివైజ్‌లు సంఖ్యను అలానే ఉంచి.. టీవీ డివైజ్‌లకు సంబంధించి పరిమితి విధిస్తుంది. కొత్త ప్లాన్ ప్రకారం.. ఒక్క అకౌంట్‌తో రెండు టీవీ డివైజ్‌లలో మాత్రమే రానుంది. అంతకంటే ఎక్కువ టీవీల్లో రావాలి అంటే ప్రీమియమ్ లేదా కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. జనవరి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని పేర్కొంది.