ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు… కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె శ్రీ వారికి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలుస్తుంది. టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో స్వాగతం పలికారు.. దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీభూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు.