నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత కూడా ఆయనకు ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. “అన్నయ్య.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!” అని ట్వీట్ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ నేపథ్యంలో కేటీఆర్, కవిత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే.