ఏసీబీ వలలో నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక…! అధికారుల ముందు కంటతడి పెట్టిన మణిహరిక ..హైదరాబాద్ లోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక…రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు…
వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు…వినోద్ నుండి లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు మణిహారికను పట్టుకున్నారు.
