ఆంధ్రప్రదేశ్ : సంక్రాంతికి విడుదల కానున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహరాజ్’ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీమ్‌లను చేర్చారు.