HomeEntertainmentఅర్జున్ S/O వైజయంతి..క‌ల్యాణ్ రామ్ స్టైలిష్ లుక్

అర్జున్ S/O వైజయంతి..క‌ల్యాణ్ రామ్ స్టైలిష్ లుక్

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో క‌ల్యాణ్ రామ్. ‘అర్జున్ S/O వైజయంతి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా, ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో అసలు హైలైట్ ఏమిటంటే, లెజెండరీ నటి విజయశాంతి మళ్లీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు.ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా విడుదల చేశారు. తాజాగా, మూవీ ప్రీ టీజర్ విడుదల తేదీని ప్రకటించేందుకు మరో స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ కొత్త లుక్‌లో కళ్యాణ్ రామ్ మాస్, స్టైల్, ఇన్టెన్సిటీ అన్నీ కలిపి కనిపిస్తున్నారు. హై ఓక్టేన్ యాక్షన్ మోడ్‌లో నిలుచొని, బ్యాక్‌డ్రాప్‌లో ఒక భారీ వర్క్ ఫీల్డ్ ఉండటం సినిమాకి ఆసక్తిని మరింత పెంచింది. ఒక్క మాటలో కళ్యాణ్ రామ్ కిల్లర్ లుక్ అంటూ నెటిజన్లు పాజిటివ్ గా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా కథ గురించి అధికారిక సమాచారం వెలువడకపోయినా, టైటిల్ చూస్తే కథలో ఎమోషనల్ డెప్త్‌తో కూడిన మాస్ యాక్షన్ డ్రామా ఉండే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ గతంలో హార్డ్ హిట్టింగ్ యాక్షన్ మూవీస్‌ చేసినప్పటికీ, ఈ సినిమా మాత్రం ఇంకాస్త ఇంటెన్స్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read