HomeEntertainmentగోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా.. అడ‌విశేషు

గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా.. అడ‌విశేషు

ఆహా గోల్డ్, “ఫర్ ది ఫైనెస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో అదిరిపోయే కంటెంట్ ను ప్రేక్షకులకు అందించడానికి. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి లేటెస్ట్ మూవీస్ ముందుగానే చూసేయ్యోచు. అలాగే ప్రీమియం తమిళం, తెలుగు కంటెంట్ లైబ్రరీని అందిస్తుంది. అలాగే ఇది అద్భుతమైన 4K రిజల్యూషన్, డాల్బీ సౌండ్‌తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించడం గురించి అడివి శేష్ మాట్లాడుతూ.. ఆహా గోల్డ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఆహా OTT ప్లాట్‌ఫారమ్ అభిమానులను అద్భుతమైన కంటెంట్‌తో కనెక్ట్ చేయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే మరపురాని అనుభవాలను కూడా అందిస్తుంది అన్నారు. స్నీక్ పీక్‌లను చూడటం అలాగే సెట్‌లో సెలబ్రెటీలు కలిసే అవకాశం కల్పించడం నిజంగా బాగుంది. ఇది అభిమానులను షూటింగ్ లో పాలుపంచుకోవడానికి అలాగే వారి అభిమాన హీరోలను , హీరోయిన్స్ ను కలుసుకునే అవకాశం కల్పిస్తుంది అని శేష్ అన్నారు. అడివి శేష్ అంబాసిడర్‌గా, ఆహా గోల్డ్ ప్రీమియం వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img