HomePoliticalఅండ‌మాన్ నికోబార్ అధ్య‌క్షుడిగా.. న‌క్క‌ల‌

అండ‌మాన్ నికోబార్ అధ్య‌క్షుడిగా.. న‌క్క‌ల‌

కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీనే వెన్నెముఖ.. ఈ రేంజ్ లో దూసుకుపోతున్న టీడీపీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ తన హవా కొనసాగిస్తుంది. ఈ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయ‌న స్కెచ్ వేస్తే అది జ‌రిగితీరాల్సిందే..ముందుచూపు క‌లిగిన నేత‌..విజ‌న‌రీ సీఎంగా చంద్ర‌బాబు నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తాయ‌న‌డంలో సందేహంలేదు..ఇందులో భాగంగా… జనాభా పరగంగా తెలుగు వారు మూడోస్థానంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావు యాదవ్ ని నియమించారు. ఈ మేరకు టీడీపీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

వాస్తవానికి అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ (ఇటీవల శ్రీ విజయపురంగా కేంద్రం పేరు మార్చింది) లో టీడీపీ ఎప్పటి నుంచో తన ఉనికి చాటుకుంటూనే వస్తోంది. ఇందులో భాగంగా… 2023లో పోర్ట్ బ్లెయిర్ లో ఐదో వార్డు కౌన్సిలర్ గా టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ సెల్వి.. ఛైర్ పర్సన్ పదవిని బీజేపీ మద్దతుతో సాధించుకున్నారు. ! 24 స్థానాలు ఉన్న కౌన్సిల్ లో ఆమెకు 14 ఓట్లు దక్కాయి. 2010లో జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేసిన టీడీపీ 4 శాతం ఓట్లతో పాటు ఓ సీటు కూడా గెలుచుకుంది. 2015 ఎన్నికల్లో 12 శాతం ఓట్లు సాధించి.. రెండు కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుంది. 2022 లోనూ మళ్లీ రెండు కౌన్సిలర్ స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అండమాన్ నికోబార్ దూవుల టీడీపీ అధ్యక్షుడిగా నక్కల మానిక్యరావు యాదవ్ ను చంద్రబాబు నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img