బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పై కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా దుర్గ్ ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకున్నది. ముంబయి పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులకు పంపారు. ఈ క్రమంలోనే ఆర్పీఎఫ్ పోలీసులు సదరు వ్యక్తిని ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకొని వీడియోకాల్ ద్వారా నిందితుడి గుర్తింపు ధ్రువీకరించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడి ముంబయి నుంచి బిలాస్‌పూర్‌కు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తి దాడి చేశాడు.
ఈ క్రమంలో ముంబయి పోలీసులు దుర్గ్ ఆర్పీఎఫ్ ఓ ఫొటో పంపారని.. దాని ఆధారంగా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఓ అనుమానాస్పద యువకుడిని అదుపులోకి తీసుకున్నామని ఆర్పీఎఫ్ ఇన్‌చార్జి సంజీవ్ సిన్హా తెలిపారు. ఆ యువకుడి పేరు ఆకాశ్ కైలాష్ కనౌజియా అని, అతని స్వస్థలం ముంబయి అని తెలిపారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో బిలాస్‌పూర్ వెళ్తున్నాడని.. టిల్డా నెవ్రాలో తెలిసినవారి ఇంటికి వెళ్తున్నానని ఆర్పీఎఫ్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు రాత్రి 8 గంటల వరకు రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి దుర్గ్‌కు వస్తారని ఆయన వివరించారు.