HomeDevotionalహ‌రీష్ రావుని క‌లిసిన‌..టిటిడి చైర్మ‌న్

హ‌రీష్ రావుని క‌లిసిన‌..టిటిడి చైర్మ‌న్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్. నాయుడు , మాజీ మంత్రి హరీష్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, హరీష్ రావు గారు నాయుడు గారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడు గారు, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు గారు అభిప్రాయపడ్డారు. టీటీడీ చైర్మన్‌గా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. హరీష్ రావు విజ్ఞప్తికి నాయుడు స్పందిస్తూ, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు గారు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్ లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img