ఈ మధ్యకాలంలో రాజకీయాలకి దూరంగా ఉన్నారు మాజీ మంత్రి..నటుడు బాబు మోహన్.. అంతా అనుకున్నట్లుగానే సొంత గూటికి చేరారు.. బాబూమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన ఓ ఫొటోను విడుదల చేశారు. తాను సభ్యత్వం తీసుకున్న ఫొటోను బాబూమోహన్ విడుదల చేశారు. కాగా, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆగస్టులో బాబూమోహన్ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ సమయంలో బాబుమోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీలో మళ్లీ చేరుతానంటూ పేర్కొన్నారు.
అయితే.. ఈ సమయంలోనే సభ్యత్వాలు ప్రారంభమవ్వడంతో బాబూమోహన్ టీడీపీ సభ్యత్వం తీసుకుని ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు తెలంగాణ పై కూడా ఫోకస్ పెట్టడంతో బాబూ మోహన్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇప్పటివరకు బాబూమోహన్ టీడీపీ నుంచి టీఆర్ఎస్.. ఆతర్వాత బీజేపీ, ప్రజాశాంతి పార్టీల్లో కొనసాగారు. రాష్ట్ర విభజనకు ముందు 15 ఏళ్లకు పైగా టీడీపీలో ఉన్న బాబూమోహన్.. మళ్లీ సొంత గూటికి చేరడం ఆసక్తికరంగా మారింది.