HomeEntertainment'మార్కో'ని బ్యాన్ చేయండి

‘మార్కో’ని బ్యాన్ చేయండి

మార్కో సినిమాను బ్యాన్ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు తెలుస్తుంది. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ మార్కో . హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించ‌గా.. యాక్ష‌న్ జాన‌ర్‌లో ఈ సినిమా వ‌చ్చింది. డిసెంబ‌ర్ 20న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. సినిమాలో మితిమీరిన వ‌యోలెన్స్ ఉన్న కూడా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సెన్సార్ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. ఈ సినిమా ఓటీటీలో సోనీ లివ్ తో పాటు అమెజాన్ ప్రైమ్ , ఆహా లో ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ లో నుంచి బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరింది. ఈ చిత్రాన్ని మ‌రి దారుణంగా తెర‌కెక్కించ‌డంతో పాటు చిన్న పిల్ల‌ల‌ను క్రూరంగా చంప‌డం, గ‌ర్భిణి యువ‌తిని.. కళ్లు లేని యువకుడిని చంపే స‌న్నివేశాలు దారుణంగా ఉన్న‌యంటూ సెన్సార్ బోర్డ్ తెలిపింది. అందుకే ఈ సినిమాను ఓటీటీలో నుంచి తొల‌గించాల‌ని కోరుతూ లేఖ రాసిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఇప్ప‌టికే ఈ సినిమాను టీవీలో ప్ర‌సారం చేయ‌కుండా బ్యాన్ విధించిన‌ట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read