డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి.
—– జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు
“విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని, రక రకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్ లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని ,ఇలాంటి నూతన స్కీం ల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందనీ జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు జిల్లా ప్రజలకు సూచించారు.ప్రస్తుతo సైబర్ నేరాలు జరుగుతున్న తీరు,సైబర్ నేరాలకు ప్రజలు గురైతున్న విధానం , ప్రజలు సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవశ్యకత గురించి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మొబైల్ కు లేదా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయినా face book, Instragram , teligram, ట్విట్టర్ అకౌంట్ వినియోగదారులకు 1. Coasta Earning App,
2.pyramid scheme
3.Adidas
- Yamaha make waves 5. LFL , 6. VC COFFEEIN పేర్లతో లింక్ ద్వారా ఫైల్ వస్తుందని దానిని ఇంస్టాల్ చేసుకున్నాక అప్లికేషన్ లో రిజిస్టర్ అయిన తరువాత ఒక వాట్సాప్ గ్రూపు కు యడ్ చేస్తారని , వారు అంతకు ముందు పెట్టినా ఎన్వెస్ట్మెంట్, వచ్చినా ప్రాఫిట్ కు సంబంధించిన నకిలీ పత్రాలను గ్రూపు లో షేర్ చెయ్యగా వాటిని నమ్మీ మొబైల్ వినియోగ దారులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుందని , మొదట చిన్నా చిన్న అమౌంట్ కు లాభాలు వెంటనే ఇస్తారని, ఎక్కువ అమౌంట్ పెట్టాక రెస్పాండ్ కారని, అలాగే ఇంకో విధానంలో నెక్ట్ లెవెల్ అంటూ ఎక్కువ అమౌంట్ తో ఎక్కువ సంఖ్యలో ఒకరి క్రింద ఒకరిని జాయినింగ్ చెపిస్తూ, వీక్ ఎండ్ లలో సక్సెస్ మీటింగ్ లు పెడుతూ ఎక్కువ మందిని జాయిన్ చేపించిన వారిని సత్కరిస్తూ మరింత ఎక్కువ మందిని జాయిన్ చేసేలా ప్రోత్సహిస్తారని , ఎక్కవ సంఖ్యలో ప్రజలు జాయిన్ అయి భారీగా పెట్టుబడులు పెట్టాక ఒకే సారి కంపని ఎత్తేస్తారని, ప్రజలు ఒక్క ముఖ్య విషయం గుర్తుంచుకోండి, ఎవరూ ముఖ్యంగా మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చెయ్యరు. మనల్ని నమ్మించి, మభ్యపెట్టి, వంచించి మన దగ్గరి, మన ద్వారా మరికొందరి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి పని. మన ఆశ, అత్యాశ వారి ఆయుధాలు.
- కాబట్టి ఇలాంటి నేరాల పట్ల, మొబైల్ ఫోన్లను చూసే మనకు Face book, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈమెయిల్, ఫోన్ కాల్ ల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఈ కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగకండి, తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోకండి. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి గానీ, www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో నైనా వెంటనే పూర్తి వివరాలతో పిర్యాదు చెయ్యాలని. ఆలస్యం విషం, అత్యాశ కొంప ముంచుతుందనే నానుడి మాటలను మనసా వాచా కర్మణా నమ్మండి” అని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు .జిల్లా లో జరుగుతున్న సైబర్ నేరాలను జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులు వెoటనే పోలీస్ స్టేషన్ లలో సైబర్ వారియర్స్ ను కలిసేలా చేసి సంబంధిత బ్యాంకు వారితో మాట్లాడి అమాంట్ ను హోల్డింగ్ చెపించడం, గ్రామాలలో సైబర్ వారియర్స్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుందని అన్నారు.