బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మార్చి 14న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ప్రీ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. అయితే ఆమీర్ ఖాన్ 60వ పుట్టినరోజు గుర్తుండిపోయే విధంగా ఉండేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అతడికి కలిసినట్లు తెలుస్తుంది. బుధవారం రాత్రి ఆమీర్ ఖాన్‌ని కలిసి అతడి ఇంటినుంచి బయటకు వస్తున్న సల్మాన్, షారుఖ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో సల్మాన్ ఖాన్ అమీర్ ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు కనిపించగా.. ఇందులో అమీర్ ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు సల్మాన్. ఇంకో వీడియోలో షారుక్ వెళ్లబోతుండగా.. ఆమీర్ షారుక్ ముఖంని కవర్ చేసుకోమని చెప్పడం.. షారుఖ్‌ని సెక్యూరిటీ సిబ్బంది కవర్ చేయడం చూడవచ్చు.