పన్ను చెల్లించడంలో ముందంజలో నిలిచాడుబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. ఆ తర్వాత స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిలిచాడు.ఆయన తర్వాత బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 92 కోట్లు ట్యాక్స్ కట్టారు షారుఖ్ ఖాన్. దళపతి విజయ్ (రూ. 80కోట్లు)
సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు) కట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది పఠాన్, జవాన్ వంటి వరుసగా వెయ్యి కోట్ల సినిమాలతో కింగ్ ఖాన్ అలరించారు. దీంతో ఆయన రూ. 92 కోట్లు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు.
ఆయన తర్వాతి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. ఈయన నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రూ. 600కోట్లకు పైగా కొల్లగొట్టిన విషయం తెలిసిందే. విజయ్ రూ. 80 కోట్లు పన్ను చెల్లించడం జరిగింది. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు ట్యాక్స్ కట్టారు.
వారి తర్వాత స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (రూ. 71కోట్లు), టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (రూ. 66కోట్లు) ఉన్నారు. ఇక మహిళా సెలబ్రిటీల్లో కరీనా కపూర్ రూ. 10 కోట్లతో టాప్‌లో ఉన్నారు. స్టార్లు చేసిన ముందస్తు పన్ను చెల్లింపుల ఆధారంగా ఫార్చ్యూన్ ఇండియా ఈ గణాంకాలను వెల్లడించింది.