HomeEntertainmentసునీల్ శెట్టికి.. తీవ్ర‌గాయాలు

సునీల్ శెట్టికి.. తీవ్ర‌గాయాలు

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ఆయన తన కొత్త సినిమా యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో సునీల్ శెట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అతడి పక్కటెముకలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే షూటింగ్ సెట్ కు దగ్గరకు వచ్చిన డాక్టర్ సునీల్ శెట్టికి చికిత్స అందించారు.

గాయం తీవ్రతను తెలుసుకోవడానికి షూటింగ్ లొకేషన్‌లోనే అతడికి ఎక్స్‌రే కూడా తీయించినట్లు తెలుస్తోంది..ప్రస్తుతం సునీల్ శెట్టి ‘హంటర్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ముంబైలోని సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈసిరీస్ లో ఓ ఫైట్ సీన్ కోసం చిత్రయూనిట్ ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంది. కానీ ప్రమాదవశాత్తు సునీల్ శెట్టికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ శెట్టి వయసు 63 ఏళ్లు. తమ హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img