కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మ ఆనందం . ఈ సినిమాకు ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించాడు. మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటనకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంద. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నిర్వహాకులు ప్రకటించారు.