టాలీవుడ్,బాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్‌ఎస్‌ఎంబీ 29. ఎస్‌ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుందని తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ రామోజీఫిలింసిటీలో కొనసాగుతున్నట్టు ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్‌లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ప్రియాంకా చోప్రా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుందట. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది ప్రియాంకా చోప్రా. తాజా టాక్ ప్రకారం స్వల్ప విరామం తీసుకున్న ప్రియాంకా చోప్రా తన సోదరుడు సిద్దార్థ్ చోప్రా వెడ్డింగ్ కోసం ముంబై వెళ్లిందని సమాచారం.
అయితే ప్రియాంకా చోప్రా లేనప్పటికీ షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జక్కన్న మహేశ్‌బాబుపై వచ్చే ట్రాక్‌ను షూట్ చేస్తున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఇక త్వరలోనే వెడ్డింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగొస్తుందట. ఆ వెంటనే షూట్‌లో చేరిపోనున్నట్టు తెలుస్తోంది.ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. తుఫాన్ తర్వాత ప్రియాంకా చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా కథనాల ప్రకారం జక్కన్న ప్రాజెక్ట్ కోసం ప్రియాంకా చోప్రా ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.