HomePoliticalజీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం..

జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం..

బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచి.. జీహెచ్ఎంసీ మేయర్‌ పీఠం అధిష్టించిన గద్వాల్ విజయలక్ష్మీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు.. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.అందుకోసం మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సమావేశమై.. ఈ అంశంపై చర్చించారు. అందులోభాగంగా జీహెచ్ఎంసీలో తమకున్న కార్పొరేటర్ల సంఖ్య బలంతోపాటు అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్య ఎంత అవసరమనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించారు.

ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సభ్యులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే.. జీహెచ్ఎంసీపై పట్టు జారకుండా ఉండేదుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.2020, డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. భారీగా డివిజన్లను కైవసం చేసుకొంది. దీంతో బంజారా హిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా జీ విజయలక్ష్మీ ఎన్నికయ్యారు.ఆమె బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేకే కుమార్తె కూడా కావడంతో.. గద్వాల్ విజయలక్ష్మీని మేయర్ పదవి వరించింది. అయితే 2023 ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బీఆర్ఎస్‌లోని పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సైతం హస్తం గూటికి చేరారు.

అలా బీఆర్ఎస్ పార్టీకి కేకేతోపాటు ఆయన కుమార్తె, మేయర్ జీ విజయలక్ష్మీ రాజీనామా చేసి… హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. ఈ నేపథ్యంలో మేయర్ జీ విజయలక్ష్మీపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేపట్టింది. అదీకాక ఈ ఏడాది చివరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవి కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తన సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం సంకల్పించింది.మరోవైపు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు డివిజన్లను మాత్రమే గెలుచుకొంది. కానీ రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. వారి సంఖ్య19కి చేరింది. మరోవైపు ఈ ఏడాది చివరల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు.ఇంకోవైపు గతేడాది మే, జూన్ మాసాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్, బీజేపీలు సరి సమానంగా ఎంపీ స్థానాలను గెలుచుకొన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు సైతం దక్కలేదు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం మేయర్ పీఠం హస్తగతం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళిలతో సిద్దమవుతోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img