HomePoliticalకుల‌గ‌ణ‌న‌.. 7 పేజీలు.. 54 ప్రశ్నలు..

కుల‌గ‌ణ‌న‌.. 7 పేజీలు.. 54 ప్రశ్నలు..

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన కోసం ప్రణాళిక శాఖ ప్రత్యేక ఫార్మాట్‌ తయారు చేసింది. మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సమగ్ర సమాచారాన్ని సేకరించేలా దీనిని రూపొందించింది. వ్యక్తిగత వివరాలే కాకుండా ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి ఇతర వివరాలను కూడా సేకరించే విధంగా సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రతి జిల్లా, మండలం, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నంబరు, ఇంటి నంబర్లకు ప్రత్యేక కోడ్‌ ఇవ్వడం ద్వారా.. ఈ సమాచారాన్ని నమోదు చేసేలా ప్రణాళిక శాఖ ఏర్పాట్లు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కులగణన ఫార్మాట్‌లో ఉన్న ప్రశ్నలివే..

పార్ట్‌ -1

క్రమసంఖ్య, కుటుంబ యజమాని-సభ్యుల పే ర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, ఉప కులం యొక్క ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్‌ నంబర్‌.పార్ట్‌ -2
ఎలక్షన్‌ కమిషన్‌ గుర్తింపు కార్డు, దివ్యాంగులైతే వైకల్య రకం, వైవాహిక స్థితి, వివాహ కాలం నాటికి వయసు, ఆరేళ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా?, పాఠశాల రకం, విద్యార్హతలు, 6-16 ఏళ్ల మధ్య వయసువారు బడి మానేస్తే ఆ సమయానికి చదువుతున్న తరగతి, వయసు, బడి మానేయటానికి గల కారణాలు, 17-40 ఏళ్లలోపు వారు విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులైతే చదువుకోకపోవడానికి గల కారణాలు.

పార్ట్‌-3

ప్రస్తుతం ఏదైనా పనిచేస్తున్నారా?, చేస్తుంటే ఆ వృత్తి, స్వయం ఉపాధి అయితే సంబంధిత వివరాలు, రోజువారీ వేతన జీవులైతే ఏ రంగంలో పనిచేస్తున్నారు?, కులవృత్తి, ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా లేదా?, కులవృత్తి కారణంగా ఏమైనా వ్యాధులు సంక్రమించాయా?, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపుదారులా?, బ్యాంకు ఖాతా ఉందా లేదా?పార్ట్‌-4
రిజర్వేషన్ల వల్ల పొందిన విద్య ప్రయోజనాలు, ఉ ద్యోగ ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రం పొందారా?, సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా?, రాజకీయ నేపథ్యం ఏమిటి?, ప్ర జాప్రతినిధిగా ఉంటే ప్రస్తుత పదవి ఏమిటి?, ఎన్ని సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు?, మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?, నామినేటెడ్‌/ కార్పొరేష న్‌/ ప్రభుత్వ సంస్థలు వేటిలోనైనా సభ్యులా?

పార్ట్‌-5
ధరణి పాస్‌బుక్‌ ఉందా, లేదా?, ఉంటే పాస్‌బుక్‌ నంబర్, భూమిరకం, విస్తీర్ణం, వారసత్వమా?, కొన్నదా?, బహుమానమా?, అసైన్డ్‌ భూమా?, అటవీ హక్కుల ద్వారా పొందినదా?, ప్రధాన నీటి వనరు, పండే పంటలు, ఏమైనా రుణాలు తీసుకున్నారా?, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు?, ఎక్కడి నుంచి తీసుకున్నారు?, వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తారా?, కుటుంబానికి చెందిన పశుసంపద (ఆవులు, ఎడ్లు, గేదెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు, ఇతరాలు) వివరాలు.


పార్ట్‌-6
కుటుంబ స్థిరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, చరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, స్వభావం, మరుగుదొడ్డి ఉందా/లేదా?, ఉంటే వాడుతున్నారా? వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇంటికి విద్యుత్‌ సదుపాయం ఉందా? ఇలా ప‌లు విష‌యాలు చెప్పాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img