ఉత్తరాంధ్ర సిక్కోలు సింగంగా పేరుగాంచారు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్రమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా ఆయన శాఖ అయిన విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని పలు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో గడిచిన 10 రోజుల్లో సుమారు 170 బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపుల వెనుక భారీ కుట్ర ఏమైనా ఉందా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవును… భారత విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల బాంబు బెదిరింపులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఓ జాతీయ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన.. దీని వెనుక కుట్ర పై స్పందించారు. ఇందులో భాగంగా… ప్రధానంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ల నుంచి గత తొమ్మిది రోజులుగా సుమారు 170 కంటే ఎక్కువ విమానాలు ఈ బెదిరింపుల వల్ల ప్రభావితమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ వరుస బెదిరింపులు భారీ కుట్రంలో భాగమేన్నా అనే ప్రశ్నకు మంత్రి ఆసక్తికరంగా స్పందించారు. అది తేల్చాసింది తాను కాదని.. నిఘా విభాగాలని స్పష్టం చేశారు! ఇదే సమయంలో… ఈ బెదిరింపుల వెనుక కుట్ర కోణం విషయంలో తాను తొందరపడి స్పందించనని, సమగ్ర విచారణ జరిగే వరకూ వేచి చూద్దామని, దీని వెనుక ఎవరు ఉన్నారో గుర్తించే పని జరుగుతుందని.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా.. లేక, పండగ సీజన్ కు సంబంధించి మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనేది గుర్తించాలని తెలిపారు.
ఈ బెదిరింపుల వల్ల విమానయాన సంస్థలకు కలుగుతున్న అంతరాయాల కారణంగా రూ.600 కోట్ల నష్టాలను అంచనా వేశారు మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ బూటకపు బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను నో-ఫ్లై జాబితాలో చేర్చుతామని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో… విమానాశ్రయాల్లో భద్రతా అంశాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు. . భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధ్హించడానికి అవసరమైన దీర్ఘకాలిక పరిష్కారాల కోసం కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు..కొంతమంది ఆకతాయిలు చేసే పనుల వల్ల దేశానికి నష్టం కలుగుతుందని..ఇకపై ఇలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరికలు జారీ చేశారు.