HomeSportsనేటి నుంచి ..'చాంపియన్స్ ట్రోఫీ'

నేటి నుంచి ..’చాంపియన్స్ ట్రోఫీ’

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. 8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ట్రోఫీ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1996 తర్వాత పాకిస్థాన్‌లో ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ఇందులో భాగంగా తొలి రౌండ్‌లో 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత నాకౌట్ దశ ఉంటుంది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. కరాచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఈ నెల 23న భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.గ్రూప్-ఎలో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ఉండగా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఇక ప్రతి జట్టును గాయాల బెడద వేధిస్తోంది. అయినప్పటికీ ఉత్తమ ఆటగాళ్లతోనే ఆయా జట్లు బరిలోకి దిగుతున్నాయి. నాణ్యమైన ఆటగాళ్లు ప్రతి జట్టులోనూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img