రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఏడాదికి రూ.2.5 లక్షల కంటే తక్కువ వ్యయం అయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97 శాతం వరకు ఉన్నట్టుగా ఒక అంచనా. ఆ వివరాల ప్రకారం కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా ఓ విధానాన్ని రూపొందిస్తున్నారు.