ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు బుధవారం హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయానికి (ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్) వెళ్ళనున్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన తెలంగాణకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చంద్రబాబు బయలుదేరి వెళతారు.