HomePoliticalబిల్ గేట్స్ తో సమావేశంకానున్న ..చంద్ర‌బాబు!

బిల్ గేట్స్ తో సమావేశంకానున్న ..చంద్ర‌బాబు!

యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో భేటీ కానున్న చంద్రబాబు

గ్రీన్ కో సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోనున్న ముఖ్యమంత్రి

కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొననున్న చంద్రబాబు

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మూడో రోజైన ఈరోజు కూడా చంద్రబాబు పలు హైప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీ కో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఈరోజు చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఏపీ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సస్టెయినబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు.

దీనితోపాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img