నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామానికి చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు.. వీరంతా హబ్సిగూడలో నివాసముంటున్నారు.. చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా పనిచేశారు.. అయితే.. ఆరు నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.. ఈ క్రమంలోనే.. కూతురు శ్రిత, కుమారుడు విశ్వాన్ రెడ్డిని చంపి.. భార్య కవితతో కలిసి సూసైడ్ చేసుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి.. కూతురు శ్రితా రెడ్డి 9వ తరగతి, కుమారుడు విశ్వాన్ రెడ్డి ఐదవ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముందు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. వారు అపస్మారక స్థితిలో ఉండగా.. గొంతునులిమి చంపి.. తర్వాత ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆర్థిక ఇబ్బందులే కారణమని రాశారు చంద్రశేఖర్. గత నెల 21నే వీరు చనిపోవాలని ఓసారి ప్రయత్నించారు. కానీ.. ఆరోజు తమ ఆలోచనను విరమించుకున్నా.. నిన్న దాన్ని అమలు చేశారు. ముందు పిల్లల్ని చంపి.. మంచంపై పడుకోబెట్టారు. ఆతర్వాత దంపతులు ఇద్దరూ చెరో గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నారు.ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశారని ఏసీపీ రాజేందర్ తెలిపారు. ఇంట్లో రెండు లేఖలు దొరికాయని వివరించారు.. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం హైదరాబాద్ లో కలకలం రేపింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.