బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ఛావా . రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ఇప్పటికే రూ.145 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.200 కోట్ల దిశగా దూసుకెళుతుంది. తాజాగా ఈ సినిమా చూడడానికి ఒక అభిమాని థియేటర్‌లోకి ఏకంగా గుర్రంపై వచ్చాడు. శంభాజీ గెటప్‌లో వచ్చిన అతడిని చూసిన ప్రేక్షకులు జై శంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది.