ఓటీటీ, సామాజిక మాధ్యమాలు ఐటీ చట్టంలోని మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఐటీ చట్టం-2021లోని నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్‌పై అనేక ఫిర్యాదులు అందాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని గుర్తు చేసింది. ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించాలని కేంద్రం హెచ్చరించింది. చిన్నారులకు ‘ఏ’ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్‌ను కూడా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. వయస్సు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని తెలిపింది. ఓటీటీలు స్వీయ నియంత్రణను కలిగి ఉండాలని, నైతిక విలువలను పాటించాలని తెలిపింది.