హైదరాబాద్: చికెన్ గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకే హైదరాబాద్ ఉప్పల్ లోని వివిధ ప్రాంతాల్లో చికెన్, ఎగ్, ఫ్రీ మేళా నిర్వహిం చారు.ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పదం బర్డ్‌ఫ్లూ. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ చికెన్, గుడ్ల వ్యాపారంపై పడింది. ఈ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో చికెన్, గుడ్లు తినకూడదనే వదంతులు అనేకం వినిపించాయి.
సోషల్ మీడియా ఎక్కువగా బర్డ్‌ఫ్లూపై ఎక్కువ ప్రచారం చేసి ఇవి తినకూడదని తప్పుడు ప్రచారం చేశారు. బాగా ఉడికించి తినే చికెన్, గుడ్లులలో బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని.. ఇలాంట ప్పుడు వాటిని తినవచ్చని వైద్య నిపుణులు, అధికారు లు అవగాహన కల్పించిన జనాలు మాటలు వినిపించుకోవడం లేదు.దీంతో తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం దారుణంగా పతనం అయింది. చికెన్, గుడ్లు రేట్లు తగ్గినా, అమ్మకాలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కానీ మళ్లీ చికెన్, గుడ్లు రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇది శుభపరిణామం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ఉదంతాలపై ఎప్పటికప్పుడు ప్రచారం చేసింది.
ఇప్పుడు అదే తరహాలో మళ్లీ ఎక్కువ మొత్తంలో ప్రజలు చికెన్, కోడిగుడ్లను కొనేలా ప్రోత్సహించడానికి ఓ మేళాను నిర్వహించింది.
ఈక్రమంలో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదనే భయాన్ని పోగొట్టేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంట నగరాల్లో శుక్రవారం చికెన్, ఎగ్, ఫ్రీ భోజనం మేళాలు నిర్వహించారు.
చికెన్ స్నాక్స్, కోడిగుడ్లను పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి హాని లేదంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో ప్రజలు ఫ్రీ చికెన్ భోజనం కోసం బారులు తీరారు. గంటల కొద్దీ లైన్లో నిలబడి చికెన్ చికెన్,ఎగ్ భోజనం చేశారు.అక్కడ కాస్త తోపులాట జరిగింది. ప్రజల్లో బర్డ్‌ఫ్లూ వల్ల ఎలాంటి భయం లేదని చెప్పేందుకే ఈ మేళాలు నిర్వహించినట్లు చికెన్ షాపుల నిర్వాహకులు అధికారులు చెప్పారు.